ఉత్తరాఖండ్ లోని జ్యోతిర్ మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సంచలన ఆరోపణలు చేశారు. కేదార్‌నాథ్‌లో గోల్డ్ స్కామ్ జరిగినట్లు ఆయన ఆరోపించారు. ఆ సమస్యను ఎందుకు లేవనెత్తడం లేదన్నారు. ఢిల్లీలో కేదార్‌నాథ్ లాంటి ఆలయాన్ని నిర్మిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేదార్‌నాథ్‌లో స్కామ్ చేశారని, ఇప్పుడు ఢిల్లీలో అలాంటి ఆలయాన్ని నిర్మిస్తారా అని అవిముక్తేశ్వరానంద ఆరోపించారు.
ఇక్కడ కాకుంటే మరో చోట స్కామ్ జరుగుతుందని, కేదార్‌నాథ్ ఆలయం నుంచి సుమారు 228 కేజీల బంగారం అదృశ్యమైనట్లు ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు ఈ కేసులో దర్యాప్తు జరగలేదన్నారు. దీనికి ఎవరు బాధ్యులు అని ఆయన ప్రశ్నించారు. ఇన్ని రకాల స్కామ్‌లకు పాల్పడి ఇప్పుడు ఢిల్లీలో కేదార్‌నాథ్ ఆలయాన్ని కడుతామని అనడడం ఎంత వరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు.