అయోధ్యలో రామాలయ భూమి పూజ.. వారికి మాత్రమే ఆహ్వానం..?

-

భారత ప్రజలందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయం నిర్మాణానికి భూమిపూజ ఇంకొన్ని రోజుల్లో జరగబోతున్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 5వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర అయోధ్య భూభాగంలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఇప్పటికే ఆలయ ట్రస్టు రామాలయ నిర్మాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ క్రమంలోనే రామాలయ భూమి పూజ కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలను పంపిస్తుంది.

ఇక ఈ భూమి పూజ కార్యక్రమం కోసం ఏకంగా 250 మంది అతిథులను ఆలయ ట్రస్టు ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ప్రధాని మోదీ కి ఆహ్వానం అందగా… ప్రస్తుతం ఆలయ ట్రస్టు ఆహ్వానిస్తున్న 250 మంది అతిథుల్లో… సాధువులు, ఎన్నో ఏళ్ల నుంచి రాముడి గుడి నిర్మాణం కోసం పోరాడిన ముఖ్య వ్యక్తులు, కొందరు కేంద్ర మంత్రులు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రులతో పాటు.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్… విశ్వహిందూ పరిషత్ సీనియర్ ప్రతినిధులకు కూడా ఆహ్వానం పంపుతున్నట్లు సమాచారం. ఇక ఆలయ భూమి పూజ అనంతరం శరవేగంగా ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని ఆలయ ట్రస్టు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news