ఆ నలుగురు చేతుల్లోనే బాలీవుడ్ పరిశ్రమ : నటుడు గోవిందా

-

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నెలకొన్న నెపోటిజం పై గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో విమర్శలు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ప్రముఖ నటుడు మాజీ ఎంపీ గోవిందా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న బంధుప్రీతి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం నలుగురైదుగురు చేతుల్లోనే ఉందని … కొంతమంది వ్యక్తులు మాత్రమే బాలీవుడ్ చిత్ర పరిశ్రమను శాసిస్తున్నారు అంటూ గోవింద వ్యాఖ్యలు చేశారు. నా సినిమాలను కూడా థియేటర్లో సరిగా విడుదల చేయలేని పరిస్థితి కూడా ఏర్పడింది అంటూ చెప్పుకొచ్చారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బంధుప్రీతి ఎక్కువగా ఉండటం కారణంగానే టాలెంట్ ఉన్న ఎంతో మంది నటులు రాణించలేక పోతున్నారు అంటూ వ్యాఖ్యానించారు.

రోజుకి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాలెంట్కు ప్రాధాన్యత తగ్గిపోతుందని… బంధుప్రీతి కారణంగానే ఎంతోమంది టాలెంటు ఉన్నప్పటికీ పరిశ్రమలో నిలదొక్కుకోలేక పోతున్నారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటుడు గోవిందా. తన తల్లిదండ్రులు నిర్మలాదేవి అరుణ్ కుమార్ లు చిత్ర పరిశ్రమకు చెందిన వారు అయినప్పటికీ నటుడిగా నిరూపించుకునేందుకు ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కోవలసి వచ్చింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు గోవిందా. ఇక ప్రస్తుతం గోవింద చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారిపోయి అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news