ప్రజలకు నీతులు చెప్పాల్సిన ప్రజాప్రతినిధులు అలాగే అధికారులే.. ప్రభుత్వ రూల్స్ పాటించకుండా… చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అధికారులను చూసి… సామాన్య ప్రజలు కూడా అడ్డదారులు తొక్కుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ అధికారులు, అలాగే ప్రజా ప్రతినిధులు.. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని ప్రభుత్వం చెబుతోంది.
అయితే ఈ నిబంధనలను అధికారులే ఉల్లంఘిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారు ఎవరైనా పోలీసులు ఈ చలాన్ లతో… హడలెత్తిస్తున్నారు. ఇలాంటి వాటిలో ప్రభుత్వ వాహనాలు సైతం ఉంటున్నాయి. తాజాగా కామారెడ్డి కలెక్టర్ వాహనం (టీఎస్ 16 ఈఈ 336 6) పై భారీ మొత్తంలో ఈ-చలానాలు ఉన్నాయి. 2016 సంవత్సరం నుంచి 2021 ఆగస్టు 20 వరకు ఏకంగా 28 చలానాలు ఉన్నాయి. ఈ చలానా ల ప్రకారం… మొత్తం రూ.27,580 జరిమానా పడింది. ఇందు లో 24 అతివేగంగా వాహనం నడపడం వల్లే పడటం గమనార్హం. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.