కోవిడ్ లక్షణాలపై సమర్థవంతంగా కోవాగ్జిన్… తాజా అధ్యయనంలో వెల్లడి..

-

దేశీయ కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ పనితనం సమర్థవంతంగా ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. కోవిడ్ లక్షణాలపై 50 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని లాన్సెట్ ఇన్ఫెక్షణ డిసీజెస్ జర్నల్ తెలిపింది. దీంతో కోవాగ్జిన్ పై నెలకొన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. రోగ లక్షణాలు ఉన్న కోవిడ్ బాధితుల్లో.. లక్షణాలపై కోవాగ్జిన్ సమర్థవంతంగా పోరాడిందని తెలిపింది సదురు జర్నల్. ఏప్రిల్ 15 నుంచి మే వరకు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో 2,714 మంది ఆసుపత్రి ఉద్యోగులపై చేసిన అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కోవాక్సిన్ రెండు డోస్‌లు తీసుకున్నవారిలో వ్యాధికి వ్యతిరేకంగా 50 శాతం ప్రభావవంతంగా ఉంటుంది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్ లో ప్రచురించింది.

హైదరాబాద్ బెస్డ్ భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాను అభివ్రుద్ధి చేసింది. దేశీయంగా తయారవుతున్న టీకాల్లో కోవాగ్జిన్ ఒకటి. సీరం ఇన్టిట్యూట్ తయారు చేస్తున్న కోవీషీల్డ్ తో పాటు… జైడస్ క్యాడిలా రూపొందిన జైకోవ్-డి వ్యాక్సిన్లు కూడా దేశీయ ఫార్మా కంపెనీలే రూపొందించాయి. ఇటీవలే కోవాగ్జిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగపు అనుమతిని ఇచ్చింది. దీంతో ఇతర దేశాలు కోవాగ్జిన్ టీకాను ఎగుమతి చేయడానికి మార్గం సుగమమైంది. ఇతర ప్రపంచ దేశాలు కూడా ప్రస్తుతం కోవాగ్జిన్ ను ఆమోదిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version