ఇన్సూరెన్స్ పేరుతో రూ. 3.5 కోట్లు మాయం.. ముగ్గురు అరెస్టు

-

ప్ర‌స్తుత రోజుల్లో మోస‌గాళ్లు పెరిగిపోతున్నారు. ప్ర‌జ‌ల‌ను సులువుగా మోసం చేసి భారీగా డ‌బ్బుల‌ను కొట్టేస్తున్నారు. ఏ మాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్న దోపిడికి గురి కావాల్సి వ‌స్తుంది. తాజా గా హైద‌రాబాద్ లోని అమీర్‌పేట్ లో గ‌ల మోతీ న‌గ‌ర్ ప్రాంతానికి చెందిన ఒక రిటైర్డ్ ప్ర‌భుత్వ ఉద్యోగి మోస పోయాడు. ఏకంగా రూ. 3.5 కోట్ల‌ను పోగుట్టుకున్నాడు. ఇన్సూరెన్స్ పేరుతో దుండ‌గులు మోసం చేశారు. కాగ ఆ గ్యాంగ్ ను నేడు సీపీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. మోతీ న‌గ‌ర్ కు చెందిన‌ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి రామరాజును పలుమార్లు ఇన్సూరెన్స్ చేసుకోవాలని దుండ‌గులు ఒత్తిడి చేశారు.

దీంతో రామ‌రాజు.. వారికి మూడు విడతల్లో రూ. 3.5 కోట్లను చెల్లించి ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. అయితే రామరాజు కొడుకు అన్సూరెన్ పత్రాల‌ను చెక్ చేశాడు. దీంతో అస‌లు నిజం బ‌య‌ట‌ప‌డింది. అవి న‌కిలీ ప‌త్రాల‌ను తెలిసిపోయింది. దీంతో తాము మోసపోయామని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీపీఎస్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని మూడు రోజుల్లోనే కేసును ఛేదించారు. అంతే కాకుండా ముగ్గురు నిందితులను కూడా అరెస్ట్ చేశారు. నిందితులు కరీంనగర్ కు చెందిన మనోజ్, వనపర్తికి చెందిన మహేష్ గౌడ్, గుడివాడకు చెందిన సుబ్రహ్మణ్యం అని పోలీసులు నిర్ధారించారు. కాగ వీరిని పోలీసులు రిమాండ్ కు త‌ర‌లించారు.

Read more RELATED
Recommended to you

Latest news