ఆర్ఆర్ఆర్ : విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఏమ‌న్నారంటే..? ఓ నాన్న విజ‌యం

-

క‌థా బ్ర‌హ్మ విజ‌యేంద్ర ప్ర‌సాద్
ట్రిపుల్ ఆర్ కు మ‌రింత ఆద‌న‌పు ఆక‌ర్ష‌ణ అయ్యారు

త‌న‌దైన శైలి క‌థ‌, క‌థ‌నంతో భారీ చిత్రాల ప‌రిధిని
మ‌రింత పెంచి సినీ రూప‌క‌ర్త‌ల గుండెల్లో ధైర్యం నింపారు

నిరీక్షణ…రెండేళ్ల నిరీక్షణ….చిత్రబృందానికి..ప్రేక్షకులకు. ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది. లక్షణమైన ఆదరణ దక్కింది. ఈ రోజు వెండితెరపై మెరిసి, ప్రేక్షకులను మురిపించిన ట్రిపుల్‌ఆర్‌ సినిమా అంచనాలను మించి రికార్డుల దిశగా దూసుకుపోతోంది. సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్టులు పనిచేయాలంటే సినిమా ముందుకు సాగాలంటే ముందుగా ఏం కావాలి. చక్కని కథ. ముచ్చటైన కథ, మెప్పించే కథ కావాలి. రాజమౌళి సినిమాలన్నింటికీ ఈ కథే మొదటి బలం.

ఆ కథ వెనకాల ఉన్న ఆయన తండ్రి విజయేంద్రప్రసాదే ఆయన అసలు బలం. అయితే విడుదలకు ముందు ఈ చిత్రబృందం జోరుగా ప్రమోషన్లు సాగించింది. కానీ ఆ ప్రమోషన్లలో ఎక్కడా కథా రచయిత అంటే విజయేంద్రప్రసాద్‌ కనిపించలేదు. ఎందుకు? ఏమై ఉంటుంది? కారణం ఏమిటి? ఇదీ అందరిలో తెలత్తిన ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాథానంగా ఎట్టకేలకు ఓ కార్యక్రమంలో విజయేంద్రప్రసాద్‌ కనిపించారు. ఈ సినిమా గురించి, ఆయన గురించి చెప్పుకొచ్చారు. చ‌ద‌వండిక.

కరోనాయే కారణం

నేను ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనకపోవడానికి కారణం కరోనా. కొద్దికాలం క్రితం నాకు కరోనా సోకింది. బాగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పడంతో అంతగా బయటికి రావట్లేదు. అందుకే ప్రమోషనల్‌ కార్యక్రమాల్లో నేను పాల్గొనలేదు.

మొదట ఎవర్నీ అనుకోలేదు

అసలు ఈ స్క్రిప్ట్‌ అనుకున్నపుడు ఏ హీరోలతో చేయాలి? ఎవరైతే బాగుంటారు అన్న ఆలోచనలేదు. ముందు పకడ్బంధీగా స్క్రిప్టును డెవలప్‌ చేసుకుంటూ వెళ్లాం. ఆ తర్వాత క్యాస్టింగ్ పై దృష్టి పెట్టాం. రకరకాల కాంబినేషన్లను అనుకున్నాం. కానీ నటులే కాకుండా నిజమైన స్నేహితులు కూడా అయి ఉంటే సినిమా బాగా వస్తుందనుకున్నాం. ఎట్టకేలకు తారక్ – చరణ్‌ కాంబినేషన్‌ బాగుంటందనిపించింది. అనిపించడమే కాదు ఇప్పుడది నిజం కూడా. వారిద్దరి జోడీ అద్భుతం.

చూసిన ప్రతీసారి కన్నీళ్లు పెట్టుకున్నా

ఈ కథలో ఇద్దరూ రెండు సింహాల్లా కనిపిస్తారు. కదిలిస్తారు. ఏడిపిస్తారు. ఎందుకంటే వారిద్దరివీ భిన్న మనస్తత్వాలు, భిన్న సిద్ధాంతాలు. ఎక్కడో ఓ చోట వారిద్దరికీ క్లాష్‌ వస్తుందని తెలుసు. అయినా నాకు మాత్రం కన్నీళ్లొచ్చాయి. ఒకసారి కాదు ఆరుసార్లు చూసినా ఇదే రియాక్షన్‌. ఆ స్థాయిలో కథ, సన్నివేశాలు ఉన్నాయి. వారిద్దరి నటనా కౌశలం సినిమా స్థాయిని మరింతగా పైకి తీసుకు వెళ్లింది.

– మ‌న లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Latest news