అంత్యక్రియలకు వెళ్తుండగా కరెంట్‌ షాక్‌తో ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానిపల్లెలో కరెంట్‌ షాక్‌తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శవాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా.. విద్యుత్‌ తీగలు తగలడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. షాక్‌ కొట్టి ముగ్గురు ప్రాణాలు విడిచారు. ఇంకో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వారిని కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Electric Shock, Electrocution, and You: A Complete Guide

ఈ ప్రమాదం శ్మశానవాటిక వద్ద వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి జరిగినట్లు స్థానికులు తెలియచేశారు. ఈ ప్రమాదంలో విద్యుదాఘాతంతో తిరుపతి, రవీంద్రన్, మునప్ప మృతి చెందినట్లు సమాచారం. కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి ముగ్గురి మృతదేహాలను తరలించారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా ముగ్గురి ప్రాణాలు పోయాయని.. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా.. ముగ్గురి మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.