తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త.. మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు

-

తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది కేసీఆర్‌ సర్కార్‌. తెలంగాణ మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు మంజూరు చేసింది కేసీఆర్‌ సర్కార్‌. 9 మెడికల్‌ కాలేజీల్లో 313 పోస్టులు మంజూరు చేశారు. క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మంజూరు చేస్తూ…ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ఆర్థిక శాఖ.

ఇక అటు ఉద్యోగాల కోసం అభ్యర్థులు డబ్బులిచ్చి మోసపోవద్దని ఉద్యోగాల భర్తీపై TSPSC కీలక ప్రకటన చేసింది. భారీగా రిలీజ్ అయిన ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని టీఎస్పీఎస్సీ తెలిపింది.

ఉద్యోగాల కోసం అభ్యర్థులు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని హెచ్చరించింది. నియామక ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనల మేరకే జరుగుతుందని వెల్లడించింది. నియామక ప్రక్రియపై నకిలీ ప్రకటనలు నమ్మవద్దని తెలిపింది. వాస్తవ సమాచారం కోసం అధికారిక సైట్ చూడాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news