ఢిల్లీలో ఘోరం: పని మనిషిపై 17ఏండ్ల బాలుడి హత్యాచారం

ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. నిర్భయ తరహా సంఘటన చోటుచేసుకుంది. పని మనిషిపై అత్యాచారం చేసిన ఓ బాలుడు అతి కిరాతకంగా ప్రవర్తించాడు. నేరం నుంచి తప్పించుకోవడం కోసం ప్రైవేట్ పార్ట్స్‌ను దహనం చేశాడు.

ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఇంట్లో పని చేసే 32ఏండ్ల మహిళపై 17ఏండ్ల బాలుడు అత్యాచారం జరిపి, హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటన జరిగిన రోజుల తర్వాత మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన మెడికల్ బోర్డు మహిళపై అత్యాచారం జరిగినట్లు ఢిల్లీ పోలీసులకు తెలిపారు. అత్యాచారానికి సంబంధించిన ఆధారాలు లభించకుండా ఉండటం కోసం మహిళ ప్రైవేట్ పార్ట్స్‌ను దహనం చేసినట్లు నిర్ధారణ అయింది.