బ్రేకింగ్ : న్యూజిలాండ్ తో టెస్ట్ మ్యాచ్ కు టీమిండియా జట్టు ప్రకటన.. కేఎల్‌ రాహుల్‌ ఔట్‌

ఈ నెల 25 నుంచి టీమిండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే… తొలి టెస్టు కు భారత జట్టు ను బీసీసీఐ పాలక మండలి ప్రకటించింది. ఈ మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ కు అజింక్యా రహానే కెప్టెన్‌ గా ఉండనుండగా… మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌.. చటేశ్వర పుజారా వైఎస్‌ కెప్టెన్‌ గా వ్యవహరించనున్నాడు.

జట్టు వివరాల్లోకి వెళితే… అజింక్యా రహానే, మయాకం్‌ అగర్వాల్‌, పుజారా, శుభ్‌ మన్‌ గిల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, సూర్య కుమార్‌ యాదవ్‌, సాహా, కేఎస్‌ భరత్‌, రవీంద్ర జడేజా, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, జయంత్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేషష్ట్ర్‌ యాదవ్‌, సిరాజ్, ప్రసిద్ధ్‌ కృష్ణలతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటన చేసింది. కేఎల్ రాహుల్ కు గాయం ఉన్న నేపథ్యంలో…అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ చోటు దక్కించుకున్నాడు. కేఎల్‌ రాహుల్‌ కు ఎడమ తొడపై గాయం అయింది. దీంతో టెస్ట్‌ సిరీస్‌ కు దూరం కానున్నారు కేఎల్‌ రాహుల్‌.