హైదరాబాద్ ప్రయాణికులకు అలర్ట్​..ఇవాళ 34 MMTS సర్వీసులు రద్దు

-

హైదరాబాద్ నగర ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌. ఇవాళ హైదరాబాద్​లో ఎంఎంటీఎస్​ రైళ్లను భారీగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆదివారం అంటే ఇవాళ 34 ఎంఎంటీఎస్​ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది దక్షిణ మధ్య రైల్వే.

లింగంపల్లి-ఫలక్​నుమా రూట్‌లో 9 సర్వీసులు రద్దు కాగా.. హైదరాబాద్-లింగంపల్లి రూట్‌లోనూ 9 సర్వీసులు రద్దైనట్లు తెలిపింది. ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్‌లో 7 సర్వీసులు రద్దు కాగా.. లింగంపల్లి-ఫలక్ నుమా రూట్‌లో 7 సర్వీసులు రద్దు చేసినట్లు పేర్కొంది.

లింగంపల్లి – సికింద్రాబాద్ రూట్‌లో ఒక్క సర్వీసు రద్దు మాత్రమే రద్దు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. నిర్వహణ సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికులకు స్వల్ప అంతరాయం కలుగుతోందని చెప్పింది. ఇవాళ ఒక్కరోజు ప్రయాణికులు సర్దుకోవాలని తిరిగి సోమవారం యథావిధిగా ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తాయని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news