హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్… భారీగా ఎంఎంటిఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబర్ 11వ తేదీన అంటే నేడు 34 MMTS సర్వీసులు రద్దు చేసింది. లింగంపల్లి-హైదరాబాద్ రూట్ లో 9 సర్వీసులు రద్దు కాగా, హైదరాబాద్-లింగంపల్లి రూట్ లోను 9 సర్వీసులు రద్దు అయినట్లు తెలిపింది.
ఫలక్ నుమా-లింగంపల్లి రూట్ లో 7 సర్వీస్ లు రద్దు అయ్యాయి. లింగంపల్లి ఫలక్ నుమా రూట్ లో 7 సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించింది. లింగంపల్లి- సికింద్రాబాద్, సికింద్రాబాద్-లింగంపల్లి రూట్ లో ఒక్కో సర్వీస్ రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది.
అలాగే ప్రయాణికులకు కీలక అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. పలు మార్గాల్లో నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయా మార్గాల్లో పనులు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రేపల్లె, తెనాలి, గూడూరు, మధిర నగరాల మధ్య నడిచే రైళ్ళను రద్దు చేసింది. ఈ నెల 10,11,12 తేదీల్లో ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది.