మీకు గోళ్ళు కొరికే అలవాటు ఉందా…? ఆ అలవాటును మానుకోవాలి అనుకుంటున్నారా..? అయితే ఈ టిప్స్ మీ కోసమే. చాలా మంది ఎప్పుడు చూసినా గోళ్ళు కొరుకుతూ ఉంటారు. నిజానికి ఇది చాలా చెడ్డ అలవాటు. చూడడానికి కూడా మంచిగా కనపడదు. అయితే మరి గోళ్ళు కొరికే అలవాటు నుండి ఎలా బయట పడవచ్చు అనేది చూద్దాం.
నిజానికి గోళ్ళు కొరకడం వలన చాలా కారణాలు ఉన్నాయి. ఒత్తిడి , గోళ్లు కొరికే అలవాటు మొదలైన వాటి వల్ల గోళ్ళు కొరుకుతూ ఉంటారు చాలా మంది. అయితే మరి గోళ్లను ఎందుకు కొరుకుతూ వుంటారు..?, ఆ అలవాటు నుండి ఎలా బయట పడచ్చు అనేది చూసేద్దాం.
గోళ్లను కొరకడానికి కారణాలు:
చాలా మంది ఎప్పుడు చూసినా గోళ్ళు కొరుకుతూ ఉంటారు. అయితే నిజానికి ఇది చాలా చెడ్డ అలవాటు. దీనికి గల కారణాలను ఇప్పుడు చూద్దాం.
ఆందోళన మరియు ఒత్తిడి:
గోళ్లను కొరకడానికి కారణం ఆందోళన మరియు ఒత్తిడి కూడా అవ్వచ్చు. ఒత్తిడి ఆందోళన ఉంటే వాళ్ళు ఎక్కువగా గోళ్లు కొరుకుతూ వుంటారు. లేదంటే కొంత మందికి అలవాటు అయ్యి ఊరికే కొరుకుతారు.
ఓసీడీ:
ఈ అలవాటు ఓసీడీ లక్షణం కూడా అవ్వచ్చు. ADHD, సెపరేషన్ యాంగ్జయిటీ, టూరేట్స్ సిండ్రోమ్, డిప్రెషన్ కి ఒక్కోసారి ఇవి లక్షణాలు అవ్వచ్చు.
పెర్ఫెక్షనిజం:
పర్ఫెక్ట్‌గా ప్రతీది ఉండాలంటే కూడా గోళ్లను చాలా మంది కొరుకుతారు. పెర్ఫెక్షన్ ఉండాలనే ఆలోచనతో ఒత్తిడి, ఆందోళనతో బాధ పడతారు.
ఈ అలవాటుకి ఇలా చెక్ పెట్టండి:
ఆందోళన మరియు ఒత్తిడి వలన ఎక్కువగా గోళ్లు కొరుకుతూ వుంటారు కనుక ఒత్తిడిని దూరం చేసుకోండి.
ఆందోళనతో బాధ పడేవారు ఆందోళనను తగ్గించుకునేందుకు చూసుకోవాలి. నెయిల్ పాలిష్ ని గోళ్లకు వెయ్యడం వలన ఈ సమస్య పోతుంది. వెనిగర్ ని కూడా గోళ్లకు రాస్తే ఈ సమస్య ఉండదు.