ప్రభుత్వ ఆస్పత్రులలో ఉద్యోగం చేస్తున్న కొంత మంది వైద్యులు ఇతర ప్రయివేటు ఆస్పత్రులను నడపుతుంటారు. అలాగే మరి కొందరు ప్రయివేటు ఆస్పత్రులలో భారీ వేతనానికి డిపార్ట్మెంట్ హెడ్ గా పని చేస్తారు. అయితే వారు ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ ఆస్పత్రి వైపు కన్నెత్తి కూడా చూడారు. అయితే ఇలాంటి వాళ్ల పై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆస్పత్రులకు రానీ వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు మొత్తం 38 మంది వైద్యులను విధుల నుంచి తొలగించింది.
చాలా కాలం అనుమతి లేకుండా ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ ఆస్పత్రికి రాని వైద్యలపై ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి కే దానికి సంబంధించిన ఉత్తర్వులను కూడా తెలంగాణ రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్ రెడ్డి జారీ చేశారు. కాగ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ ఆస్ప్రతి సిబ్బంది పై కూడా సీఎం కేసీఆర్ పలు ఆదేశాలను జారీ చేశారు. అందులో భాగంగానే వైద్య అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.