రేషన్ కార్డు దారులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్..రేపటి నుంచి బియ్యం పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు దారులకు కేసీఆర్‌ సర్కార్‌ అదిరి పోయే శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని… రేషన్‌ కార్డు దారులకు బుధవారం నుంచి రేషన్‌ బియ్యం పంపిణీ చేయనున్నట్లు… తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి. అనిల్‌ కుమార్‌ ఓ ప్రకటన దారి స్పష్టం చేశారు.

” పంపిణీ వ్యవస్థకు సంబంధించిన సాఫ్ట్‌ వేర్‌ లో తలెత్తిన సమస్య పరిష్కారమవని.. కారణంగా మంగళ వారం నుంచి కాకుండా బుధవారం నుంచి పంపిణీ చేస్తున్నాం. దీనిపై లబ్ది దారులు ఎవరూ కూడా ఆందోళన చెందనవసరం లేదు. ప్రతి లబ్ది దారులకు రేషన్‌ బియ్యం అందుతుంది. కొన్ని సాంకేతిక సమస్య కారణంగానే ఆలస్యం అయింది” అంటూ తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి. అనిల్‌ కుమార్‌ క్లారిటీ ఇచ్చారు. కాగా… ప్రతి నెల 1 వ తేదీ నుంచి లేదా 2 వ తేదీ నుంచి రేషన్‌ కార్డు బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది.