బిగ్ బ్రేకింగ్ : 395 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్..!

-

బెంగ‌ళూరులో 395 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు మంది పోలీసులు క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్లు పోలీసు ఉన్న‌తాధికారులు గురువారం వెల్ల‌డించారు. గురువారం నాటికి 190 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, మ‌రో 200 మంది చికిత్స పొందుతున్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో బెంగ‌ళూరులో 20 పోలీసు స్టేష‌న్ల‌ను మూసివేశారు. బెంగ‌ళూరులో క‌రోనాను త‌రిమికొట్టేందుకు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

police
 

ఈ క్ర‌మంలో సీఎం యెడియూర‌ప్ప నేతృత్వంలో మంత్రివ‌ర్గం స‌మావేశ‌మై క‌రోనా క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించింది. ‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా బెంగ‌ళూరు సిటీని 8 జోన్లుగా విభ‌జించాల‌ని సీఎం నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. ప్ర‌తి జోన్ కు ఒక మంత్రి బాధ్య‌త వ‌హించి.. కొవిడ్ నివార‌ణ చ‌ర్య‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తార‌ని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news