ప్రపంచ వ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ అమలు కావడంతో ఇప్పుడు దాదాపు అన్ని వ్యవస్థలు కూడా మూతపడిన సంగతి తెలిసిందే. మన దేశంలో నిత్యావసర సరుకులు మినహా ఏ ఒక్కటి కూడా అందుబాటులో లేదు అనేది అర్ధమవుతుంది. దీనితో చాలా మంది ప్రజలు తమకు అత్యవసరం అయితేనే బయటకు వస్తున్నారు. ఈ తరుణంలో పాడు అయిపోయిన వస్తువులు కూడా ఇప్పుడు బాగు చేయించుకునే అవకాశం లేదు.
దీనితో మన దేశంలో దాదాపు 4 కోట్ల మొబైల్స్ రిపైర్స్ లేకుండా అలాగే ఉండిపోయే అవకాశం ఉందని తాజాగా ఒక సర్వే చెప్పింది. నాలుగు కోట్ల మంది మొబైల్ సేవలకు దూరం అయ్యే అవకాశం ఉందని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ పేర్కొంది. మొబైల్ ఫోన్లు దీర్ఘకాలంతో సర్వీసుకు దూరంగా ఉండటంతో బ్రేక్ డౌన్ అయ్యే అవకాశం ఉందని… అన్ని రకాల మొబైల్స్ ఆగిపోతాయని పేర్కొంది.
వాటిని రిపైర్ చేయి౦చకపోతే అవి ఎందుకు పనికి వచ్చే అవకాశం ఉండదు అని పేర్కొంది. మొబైల్ ఫోన్లు, విడి భాగాల విక్రయాలపై లాక్‌డౌన్ ఆంక్షలు ఇలాగే కొనసాగితే… లాక్ డౌన్ సరఫరా చెయిన్‌లో మొబైల్ ఫోన్ల విడిభాగాలు లేవు అని… అలాగే కొత్త మొబైల్ ఫోన్స్ పై ఆంక్షలుండటంతో ప్రస్తుతం 2.5 కోట్ల మందికి పైగా వినియోగదారుల ఫోన్లు నిరుపయోగంగా ఉన్నాయని పేర్కొంది. మన దేశంలో 85 కోట్ల మొబైల్స్ ఉన్నాయని పేర్కొంది.