భారత్‌కు భూకంప ముప్పు.. ముఖ్యంగా ఆ నగరాల్లో..

-

టర్కీ, సిరియాల్లో భూకంపం సృష్టించిన విలయం గురించి ప్రపంచమంతా తెలుసు. ఈ నేపథ్యంలో మరికొన్ని దేశాల్లోనూ భూకంపాలు వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ ముప్పు భారత్‌కు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 59 శాతం భూభాగం.. భూకంపాలకు గురయ్యే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

భూకంపాల ముప్పు అత్యధికంగా ఉన్న జోన్‌లో కశ్మీర్‌, పశ్చిమ, మధ్య హిమాలయాలు, ఉత్తర బిహార్‌, మధ్య బిహార్‌, ఈశాన్య భారత్‌ ప్రాతాలు, రాన్‌ ఆఫ్‌ కచ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులున్నాయి. హై డ్యామేజ్‌ రిస్క్‌ జోన్‌లో దిల్లీ, లద్దాఖ్‌, హిమాచల్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, సిక్కిం, ఉత్తర పంజాబ్‌, చండీగఢ్‌, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బిహార్‌లోని ప్రధాన భూభాగాలు, ఉత్తర బెంగాల్‌, సుందర్బన్‌ ప్రాంతాలు ఈ జోన్‌ పరిధిలో ఉన్నాయి.

ఇది మధ్యస్థ ప్రభావం కలిగిన జోన్‌. చెన్నై, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, భువనేశ్వర్‌ లాంటి ప్రధాన నగరాలు ఈ జోన్‌ పరిధిలోకి వస్తాయి. ఇది స్వల్ప తీవ్రత కలిగిన జోన్‌. ఈ ప్రాంతాల్లో భూకంపం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. తిరుచిరాపల్లి, బులంద్‌షహార్‌, మోరదాబాద్‌, గోరఖ్‌పూర్‌, చండీగఢ్‌లోని కొన్ని ప్రాంతాలు, దక్షిణాది భూభాగాలు ఈ జోన్‌లో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news