మూడో వన్డేలో టీమిండియా చెత్త బ్యాటింగ్ కారణంగా… ఆస్ట్రేలియా జట్టు అవలీలగా విజయం సాధించింది. నిన్నటి మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 269 పరుగులు చేసింది. ఇక 270 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆది నుంచి… తడబడింది. విరాట్ కోహ్లీ మరియు హార్దిక్ పాండ్యా తప్ప అందరూ విఫలమయ్యారు. అయితే.. ఆసీస్ మూడో వన్డేలో టీమిండియా ఘోర ఓటమికి ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పు డు చూద్దాం. ఈ మ్యాచ్ లోనే కాదు ఈ సిరీస్ మొత్తంలో టీమిండియా బ్యాటింగ్ చాలా పేలవంగా ఉంది.
తొలి మ్యాచ్ లో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఆడిన ఇన్నింగ్స్ లు తప్పించి ఈ సిరీస్ లో టీమిండియా బ్యాటింగ్ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు.టీమిండియా బౌలింగ్ ప్రదర్శన బ్యాటింగ్ కంటే బాగానే ఉన్నా, ఆరంభంలో వికెట్లు తీసి చివరి వికెట్లు తీయడంలో ఇబ్బంది పడుతున్నారు. దీంతో, ప్రత్యర్థి జట్టుకు రావాల్సిన పరుగుల కంటే ఆదనంగా పరుగులు వస్తున్నాయి.ఈ సిరీస్ లో టీమిండియా కు పెద్ద మైనస్ ఏంటంటే సూర్య కుమార్ యాదవ్. ఎందుకంటే ఈ సిరీస్ లో సూర్య ఒక్కటంటే ఒక్క పరుగు కూడా చేయలేదు. టీమిండియాలో ఓటముల్లో చాలా కాలంగా ప్రధాన పాత్ర పోషిస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది టపార్డర్ బ్యాటింగ్ అని చెప్పాలి. టీమిండియా గెలిచిన టెస్ట్ సిరీస్ లో రోహిత్ శర్మ తొలి టెస్ట్ లో చేసిన సెంచరీ మినహా పెద్దగా టపార్డర్ చేసిందేమీ లేదు.