నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా – రేవంత్ రెడ్డి

-

సిట్ ఆఫీసులో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి విచారణ ముగిసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ని రికార్డు చేశారు సిట్ అధికారులు. దాదాపు గంటపాటు సిట్ అధికారులు ఆయనను విచారించారు. ఇక విచారణ అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సిట్ కాదు… సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ కావాల్సిందేనని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ అక్రమాల పుట్ట అని తేలిపోయిందన్నారు. ఒకటి కాదు… అరడజను ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని స్పష్టమైపోయిందన్నారు.

“రోజుకో దారుణం బట్టబయలవుతోంది. ఇద్దరితో మొదలై 20 మందికి చేరింది… పెద్దల హస్తం లేనిదే పరీక్ష పత్రాలు లీకేజీ సాధ్యం కాదని ప్రజలకు అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ – కేటీఆర్ అండ్ కో నియమించిన “సిట్” విచారణకు పిలిచింది. తప్పును ఎత్తి చూపడమే నేరమట. ఆరోపణల గురించి ప్రస్తావించ కూడదట. అన్యాయాన్ని నిలదీయకూడదట. సమాధానం చెప్పమని పిలిచింది. వెనక్కు తగ్గేదే లేదు. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ కోసం కొట్లాడుతా. 30 లక్షల నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా” అన్నారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news