కరోనా సోకడం ఏమో గాని ఆస్పత్రుల్లో ఉండటం మాత్రం చాలా మందికి నరకం గానే ఉంది ప్రస్తుతం. చాలా వరకు కూడా ఆస్పత్రుల్లో ఉండటానికి అసలు ఎవరూ కూడా ఇష్టపడటం లేదు. కరోనా కంటే కూడా ఆస్పత్రులే నరకంగా ఉన్నాయి అని భావించి ఆస్పత్రుల నుంచి పారిపోతున్నారు. అది పక్కన పెడితే… ఇప్పుడు హోం ఐసోలేషన్ లో ఉండే వారు కూడా పారిపోవడం అధికారులను, ప్రభుత్వాలను కాస్త చికాకు పెడుతుంది.
తాజాగా 42 మంది కరోనా రోగులు మిస్ కావడం రాష్ట్రం మొత్తాన్ని షేక్ చేసింది. ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ లో 42 మంది కరోనా రోగులు కనపడకుండా పోయారు. దీనితో ఆ నగర చీఫ్ మెడికల్ ఆఫీసర్ గాజిపూర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్కు లేఖ రాశారు. వాళ్ళు ఆస్పత్రులలో గాని, ఇంట్లో గాని లేరు అని, లేఖలో పేర్కొన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది తాము విచారిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.