బ్రేకింగ్: ఆటో కార్మికులకు సిఎం జగన్ గుడ్ న్యూస్

-

లాక్ డౌన్ కారణంగా చాలా మంది నష్టపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రవాణా వ్యవస్థ అయితే పూర్తిగా నాశనం అయిపోయింది. ప్రభుత్వాల కింద పని చేసే ఆర్టీసీ కూడా నాశనం అయిపోయింది. దీనితో పన్నులు కట్టలేక చాలా మంది రోడ్డున పడుతున్నారు. ఈ తరుణంలో ఏపీ సిఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు టాక్స్ కట్టేందుకు గడువు పెంచాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా నేపథ్యంలో రోడ్డు టాక్స్ కట్టేందుకు ఇచ్చిన గడువు నేటితో ముగుస్తుంది. లాక్ డౌన్ కారణంగా నష్టాల్లో ఉన్న ఆటో, టాక్సీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం దృష్టికి మంత్రి పేర్ని నాని తీసుకున్నారు. రోడ్డు టాక్స్ గడువు సెప్టెంబర్ నెలాఖరు వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాయంత్రం అధికారిక ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news