ఉత్తరాఖండ్ వరదల్లో చనిపోయిన కుటుంబాలకు రూ.4లక్షల ఎక్స్ గ్రేషియా..!

-

వరదల వల్ల చనిపోయిన కుటుంబాలకు ఉత్తరాఖండ్ రాష్ట్ర‌ ప్రభుత్వం రూ.4ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించింది. భారీ వరదల వల్ల 11 మంది గల్లంతు కాగా చాలా మంది క్షతగాత్రులు అయ్యార‌ని మృక్య‌మంత్రి పుష్కర్ సింగ్ దామీ వెల్ల‌డించారు. వరద సహాయక ఎర్పాట్ల కోసం ప్రతి జిల్లా కలెక్టర్ కు 10కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుద‌ల చేసింది. నిన్నటి నుంచి ఉత్తరాఖండ్ లో వ‌ర్షాలు త‌గ్గుముకం పట్టినట్టు సీఎం తెలిపారు. గత నాలుగు రోజుల నుండి కుండపోతగా వ‌ర్షాలు కురుస్తున్నాయి.

భారీ వర్షాల వరదల వల్ల చాలా ప్రాంతాల్లో విద్వంసక‌ర దృశ్యాలు క‌నిపిస్తున్నాయి. రోడ్లు, వంతెనలు వర్షాల వల్ల కోట్టుకపోయాయి. కొండ‌ చర్యలు విరిగిపడటం వల్ల చాలా ప్రాంతాలకు రోడ్డు మార్గాలు మూసుకపోయాయి. యుద్ద ప్రాతిపదికన రోడ్లు మార్గాలకు మరమత్తులు చేస్తున్నారు. వర్షాల వల్ల చాలా గ్రామాలు వరదల్లో చిక్కుకపోయాయు అంతే కాకుండా కరెంటు సరపరా సైతం నిలిచిపోయింది. చార్ దామ్ యాత్రకు వచ్చిన ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. యాత్ర‌కు వ‌చ్చిన వారిని త‌మ రాష్ట్రాల‌కు పంపిచే ప్ర‌య‌త్నం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news