Prabhas: పూరి కొడుకుపై ప్రభాస్ కామెంట్స్.. ఆ మాట‌లు విని క‌న్నీరు పెట్టుకున్న‌ డేరింగ్ డైరెక్ట‌ర్!

-

Prabhas: టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన సినిమా రొమాంటిక్. ఈ చిత్రం పూరి కనెక్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. ఈనెల 29న థియేటర్లలో విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన మూవీ మేక‌ర్స్.. హీరో ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయించారు.

అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ.. టైటిల్‌కు తగ్గట్లుగానే ట్రైలర్‌ చాలా రొమాంటిక్‌గా ఉందనీ, హీరో ఆకాష్ న‌ట‌న అద్భుతంగా ఉంద‌నీ, యాక్టర్‌గా ఆకాష్‌ ఇంప్రూవ్‌ అయ్యాడని, త‌న‌ తొలి సినిమాకీ.. ఇప్పటికీ చాలా పరిణతి చెందాడని తెలిపాడు. ఎప్ప‌టిలాగే రమ్యకృష్ణ అద్భుతంగా నటించారని అన్నారు. ఈ టైల‌ర్లో ఆకాష్‌, కేతికా శర్మల మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని అభినందించారు. తన కొడుకుపై ప్రభాస్ ఇలా పాజిటివ్‌గా కామెంట్ చేయడంతో పూరి కాస్త ఎమోషనల్ అయ్యారు. చిత్ర యూనిట్ సమక్షంలో ఆయనలో ఆనంద బాష్పాలు కనిపించాయి.

అనంత‌రం పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ.. ‘రొమాంటిక్‌’ సినిమా విడుదల చేస్తున్నామని తెలియగానే ఈ సినిమా గురించి ప్రభాస్‌ ఫోన్‌ చేసి అడిగారని, ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేస్తా అని ఆయనే స్వయంగా చెప్పారని, మూవీ గురించి ఏమన్నా ట్వీట్‌ వేయాలా? ఇంటర్వ్యూ ఇవ్వాలా? అని అడిగారని .. అది విని చాలా సంతోషించానని పూరి జగన్నాథ్ అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు అనిల్ పాదూరి దర్శకత్వం వహించగా కేతికా శర్మ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, వీడియోలు సినిమాపై ఆసక్తి పెంచేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news