ఇవాళ హుజురాబాద్ లోని జమ్మికుంట మండలం అంకుషాపూర్ గ్రామంలో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ టీఆర్‌ఎస్ పై ఫైర్ అయ్యారు. దళిత బంధు బిసిలు వద్దన్నన్నారని కేసీఆర్ అన్నాడని.. దళిత బంధు పేరుతో పేదోళ్ల మధ్య చిచ్చు పెడుతున్నాడని ఫైర్ అయ్యారు. దళిత బంధు ను మేము ఎప్పుడు వ్యతిరేకించలేదని.. హైదరాబాద్ ఎన్నికల సమయంలో కూడా తన సంతకము ఫోర్జరీ చేసారని మండిపడ్డారు. నిజం తేల్చుకుందాం భాగ్యలక్ష్మి టెంపుల్ కి రమ్మన్నా రాలేదన్నారు.
దళిత బంధు ఇవ్వమని మేము చెప్పామని.. బ్యాంకు ఎకౌంట్ లో వేసిన డబ్బులు తీసుకొనివ్వలేదని మండిపడ్డారు. దళిత బంధు పైసలు ఇవ్వమని తాను కూడా చెప్పానని.. దళిత బంధు పై నీతి నిజాయితీ ఉందో..లేదో యాదాద్రి లో తేల్చుకుందాం రా అని కేసీఆర్ కు సవాల్ విసిరారు.
టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చే పైసలు తీసుకుని.. ఓటు మాత్రం బిజెపి కి వేయాలని పేర్కొన్నారు బండి సంజయ్. దళిత బంధు పై చర్చకు దమ్ముంటే రావాలని.. కేసీఆర్ ప్లాన్ ప్రకారమే దళిత బంధు ఆపేశారని ఆరోపించారు. దళిత బంధు తమ ప్రాంతాల్లో కావాలని ఎమ్మెల్యేలు ఇబ్బంది పెడితే ఇలా చేశాడని.. త్వరలో కేసీఆరే దళిత బంధు పై కోర్టులో పిటిషన్ వేస్తాడని మండిపడ్డారు. ప్రతి దళిత కుటుంబానికి పది లక్షలు ఇచ్చే వరకూ ఉద్యమం చేస్తానని హామీ ఇచ్చారు.