Breaking : నదిలో దొరికిన 50 కేజీల వెండి శివయ్య..

-

ఉత్తరప్రదేశ్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని దోహ్రీఘాట్ పట్టణంలో ఘాగ్రా నదిలో 50 కిలోల వెండి శివలింగం లభ్యమైంది. బిందెను కడిగేందుకు మట్టి తీస్తున్న రామ్ మిలన్ సాహ్ని అనే వ్యక్తి చేతికి ఈ శివలింగం తాకింది. ఎంతో బరువుగా ఉండటంతో మరోకరి సహాయంతో ఈ శివలింగాన్ని బయటకు తీశారు రామ్ మిలన్. ఆ తర్వాత ఆ లింగాన్ని గ్రామంలోని ఆలయంలోకి తీసుకెళ్లి పూజలు, అభిషేకాలు చేశారు.

ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలియడంతో ఈ శివలింగాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు శివలింగాన్ని స్వాధీనం చేసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. పూజలు చేసేందుకు కొందరు భక్తులు పోలీసు స్టేషన్‌కు కూడా చేరుకున్నారు. ఈ శివలింగంపై దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించామని విచారణ అనంతరం శివలింగాన్ని ప్రజలకు అప్పగిస్తామని తెలిపారు పోలీసు అధికారులు.

 

Read more RELATED
Recommended to you

Latest news