“రష్యా – ఉక్రెయిన్” యుద్దానికి 500 రోజులు పూర్తి.. !

-

రష్యా తలపెట్టిన ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ లో భాగంగా తన పక్క దేశం ఉక్రెయిన్ పై ఎటువంటి దయాదాక్షిణ్యాలు లేకుండా విచక్షణారహితంగా దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య ఈ యుద్దాన్ని ఆపడానికి ప్రపంచంలోని అనేక దేశాలు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ రోజుతో ఆ యుద్దానికి 500 రోజులు పూర్తి అయింది. ఈ యుద్ధం కారణంగా మొత్తం 9000 మంది అమాయక ప్రజలు మరించారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. చనిపోయిన వారిలో అభం శుభం తెలియని చిన్న పిల్లలు 500 మంది ఉన్నారు. ఇక ప్రాణ భయంతో 63 లక్షల మంది ఉక్రెయిన్ మమ్మల్ని చంపకండి అంటూ రష్యా కు లొంగిపోయారు. ఇంకా 60 లక్షల మంది ఏ ఆశ్రయం లేకుండా ఉండిపోయారు. ఇక ఇరు దేశాలకు చెందిన సైనికులు వేలమందికిపైగా మరణించి ఉంటారు.

అయితే దీనిపై అటు రష్యా ఇటు ఉక్రెయిన్ ల నుండి ఎటువంటి సమాచారం లేదు అని ఐక్యరాజ్యసమితి తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news