ఈ అదిరే స్కీమ్ తో రూ. 50వేలు పెన్షన్..!

-

చాలా మంది వివిధ రకాల స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. ఈ స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం వలన చక్కటి లాభాలని పొందేందుకు అవుతుంది. ఉద్యోగస్తులు తమ భవిష్యత్తును ఆర్థికంగా కాపాడుకునేందుకు చాలా స్కీమ్స్ వచ్చాయి. ఈ స్కీమ్స్ లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా ఒకటి. వృద్ధాప్యంలో ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకూడదని అనుకునే వారు ఇందులో డబ్బులు పెట్టడం మంచిది.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ ని ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఈ పథకంలో ఉద్యోగ సమయంలో డబ్బును జమ చేస్తూ ఉంటే పదవీ విరమణ తర్వాత పెన్షన్ రూపంలో వస్తాయి. అయితే ఎన్‌పీఎస్‌ లో జమ చేసిన డబ్బును రెండు విధాలుగా పొందవచ్చు. డిపాజిట్ చేసిన మొత్తంలో పరిమిత భాగాన్ని ఒకేసారి విత్‌డ్రా చెయ్యచ్చు లేదంటే పెన్షన్ కోసం జమ చేయబడుతుంది. ఈ మొత్తం నుంచి యాన్యుటీ కొనుగోలు చేయబడుతుంది. ఐతే ఎంత ఎక్కువ డబ్బును పక్కన పెట్టారో అంత మీకు రిటైర్ అయ్యాక పెన్షన్ కింద వస్తుంది. ఇక ఎంత వస్తుందనేది చూస్తే.. మీరు నెలకు రూ. 6000 పెట్టుబడి పెట్టడం ద్వారా 60 ఏళ్ల తర్వాత రూ. 50,000 పెన్షన్ వస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా పొందవచ్చు.

NPSలో రెండు రకాల ఖాతాలు తెరవబడతాయి – NPS టైర్-1, NPS టైర్-2 (NPS). టైర్-1 ఖాతా ప్రధానంగా పీఎఫ్ డిపాజిట్లు లేని, పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోరుకునే వ్యక్తుల కోసం. ఇందులో కనీసం రూ.500 డిపాజిట్ చేసి ఖాతా తెరవవచ్చు. ఇందులో కనీసం రూ.500 డిపాజిట్ చేసి ఖాతా తెరవవచ్చు.  పదవీ విరమణ తర్వాత, మీరు మొత్తంలో 60% వరకు ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు.

మిగిలిన 40 శాతం మొత్తం నుండి యాన్యుటీని కొనుగోలు చేస్తారు. 24 సంవత్సరాల వయస్సులో ఎన్‌పిఎస్‌లో ఖాతా ని ఎవరైనా ఓపెన్ చేసి నెలకు రూ.6,000 పెట్టుబడి ౬ని 0 సంవత్సరాల వయస్సు వరకు అంటే మొత్తం 36 ఏళ్ల పాటు ఈ పథకంలో డబ్బు డిపాజిట్ చేస్తే… 60 ఏళ్లు కి రూ.25,92,000 పెట్టుబడిగా ఉంటుంది.  10% రాబడి కింద చూస్తే.. మొత్తం కార్పస్ విలువ రూ. 2,54,50,906 ఉంటుంది. 40% మెచ్యూరింగ్ ఆదాయం నుండి యాన్యుటీని కొనుగోలు చేసినట్టయితే రూ.1,52,70,544 ఆదాయం వస్తుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.50,902 పెన్షన్ కింద వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news