మెయిల్ తో 52 లక్షలు కొట్టేసారు…!

-

యూఎస్ కంపెనీ పేరుతో నకిలీ ఈమెయిల్ క్రియేట్ చేసి 52 లక్షలు మోసం చేసారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాదుకు చెందిన పోకర్ణ గ్రానైట్ అనే కంపెనీ, సౌత్ అమెరికా చెందిన కంపెనీ తో ఆన్లైన్ ద్వారా వ్యాపారం చేస్తున్నాయి. యూఎస్ కంపెనీ పేరుతో నకిలీ ఈమెయిల్ క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లు… ఆర్డర్ చేసిన మెటీరియల్ పంపించామని.. అందుకుగాను 59 వేల యూరోలు ( 52 లక్షల రూపాయలు ) అకౌంట్ లో ట్రాన్స్ ఫర్ చేయాలని హైదరాబాద్ కి చెందిన కంపెనీకి ఈమెయిల్ చేసారు.

cyber
cyber

ఎప్పటిలాగానే వారు పంపిన ఈమెయిల్ లో ఉన్న అకౌంట్ లోకి 52 లక్షల రూపాయలు ట్రాన్స్ ఫర్ చేసారు కంపెనీ ప్రతినిధులు. అనంతరం రోజులు గడుస్తున్నా మెటీరియల్ రాకపోడంతో అనుమానం వచ్చిన కంపెనీ ప్రతినిధులు.. నకిలీ ఈమెయిల్ ను గుర్తించారు. మోసపోయామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కంపెనీ ప్రతినిధి గౌతమ్ జైన్… ఆధారాలు కూడా ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news