కామ్రేడ్ కోటేశ్వరమ్మ కన్నుమూత

-

ప్రముఖ విప్లవ నాయకుడు, నక్సల్ నేత కొండపల్లి సీతారామయ్య సతీమణి కామ్రేడ్ కొండపల్లి కోటేశ్వరమ్మ బుధవారం తెల్లవారు జామున కన్నుమూశారు. విశాఖలో తన మనవరాలు ఇంటి వద్దనే తుది శ్వాస విడిచారు.  ఇటీవలే ఆగస్టు 5న కుటుంబ సభ్యులతో కలిసి తన 100వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.

కోటేశ్వరమ్మ కోరిక మేరకు ఆమె పార్థీవ  దేహాన్ని విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రికి అప్పగిస్తామని చిన్న మనువరాలు సుధా తెలిపారు. ఐక్య కమ్యూనిస్టు రెండుగా చీలిపోయినప్పుడు అతివాద ఉద్యమంలో ఆమె కీలకపాత్ర పోషించారు. తాను రచించిన ‘నిర్జన వారధి’ పుస్తకం సాహితీ లోకంలో చిరస్థాయిగా నిలిచింది. ఇటీవల ఓ పాత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఆమె మాట్లాడుతూ.. నన్ను అభిమానించే వాళ్లని ఎంతో మందిని సంపాదించుకోగలిగాను, ప్రేమించేవారిని పొందగలిగాను అలాంటి వారి ముందు ఎంతటి కష్టమైనా చిన్నదిగానే కనిపిస్తుంది అంటూ పేర్కొన్నారు.

ప్రముఖుల సంతాపం

కామ్రేట్ కొండపల్లి కోటేశ్వరమ్మ మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి, సీపీఐ, సీపీఎం నేతలు సంతాపం ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news