ఓమైగాడ్.. గాల్లో పల్టీలు కొట్టిన విమానం..!

-

ఏం చెప్పాలనా? ఈ వీడియోలు చూసిన తర్వాతనే. ముందు ఈ రెండు వీడియోలు చూడండి. తర్వాత మాట్లాడుకుందాం.

చూశారా వీడియోలు. మొదటి వీడియో చూడగానే షాక్ అయ్యారా? ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వీడియో చూశారు కదా. కానీ.. చివరకు ఎవరి ప్రాణాలకు ఏం కాలేదు కదా అంటారా? రెండో వీడియో కూడా చూశారా? ఎమర్జెనీ ల్యాండ్ అయిన విమానం నుంచి ప్రయాణికులు దిగుతున్నట్టుగా ఉంది కదా. ఈ రెండు వీడియోలను చూస్తే ఏమనిపిస్తుంది మీకు. గాల్లో పల్టీలు కొట్టిన ఆ విమానం ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది అని అనిపిస్తున్నది కదా.

కానీ.. మీరు ఇప్పటి వరకు ఊహించుకున్నదంతా తప్పు. అది నిజం కాదు. అబద్ధం. అవును.. షాక్ కాకండి.. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం పదండి.

ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. జేమ్స్ జోర్డాన్ అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్ లో ఇప్పుడు మీరు పైన చూసిన వీడియోను షేర్ చేశాడు. భయంకరమైన తుఫాన్ కారణంగా ఆ విమానం గాల్లో పల్టీలు కొట్టింది. హాంగ్ కాంగ్ ఫ్రెండ్స్ అంతా క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నా. విమానం పల్టీలు కొట్టినా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ప్రయాణికులను కాపాడిన పైలెట్ ను సన్మానించాల్సిందే.. అంటూ ఆవ్యక్తి ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.

కట్ చేస్తే.. మరో రెండు గంటల్లో ఇంకో పోస్ట్ పెట్టాడు జేమ్స్. ఏమని.. అంటూ అది గాలిలో పల్టీలు కొట్టినట్టు కనిపిస్తున్న వీడియో నిజమైనది కాదు.. నేనే తప్పుగా అనుకున్నాను అంటూ మరో వీడియో పెట్టాడు.

నిజానికి గాల్లో పల్టీలు కొట్టినట్టు కనిపిస్తున్న ఆ విమానం బాపతు వీడియో కంప్యూటర్ లో డిజైన్ చేసింది. నిజమైనది కాదు. ఇంకో వీడియోలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన విమానం బాపతుది మాత్రం నిజం. కానీ.. అది గత నెలలో చైనాలో జరిగింది. బీజింగ్ నుంచి మకావో వెళ్తున్న విమానం.. షెన్జెన్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అదన్న మాట అసలు సంగతి. ఆ రెండు వీడియోలను కలిపి కొట్టి నెటిజన్లను పిచ్చోళ్లను చేశారు కొంతమంది.

Read more RELATED
Recommended to you

Latest news