పాకిస్థాన్ అమ్మాయి జనగనమన పాడింది..!!

-

భారత జాతీయ గీతం జనగనమనను పాకిస్థాన్ కు చెందిన ఓ అమ్మాయి పాడటం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ కు చెందిన ఆ అమ్మాయి తన పాడిన జనగనమనను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇన్ స్ట్రుమెంటల్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తుండగా ఆ అమ్మాయి జనగనమన ఆలపించింది. అయితే.. నిజంగా ఆ అమ్మాయిది పాకిస్థానేనా అనేదే ప్రస్తుతం నెటిజన్లకు వస్తున్న డౌట్. ఆ అమ్మాయి ట్విట్టర్ అకౌంట్ లో మాత్రం లాహోర్ సెట్ చేసి ఉంది.

ఏదో ట్రై చేశా.. నా వాయిస్ ఎలా ఉంది అనే విషయాన్ని వదిలేయండి. ఇక.. పాకిస్థానీయులారా? నాకు పాకిస్థాన్ అంటేనే ఇష్టం. దీనిపై మీరు ఏమనకున్నా నేను పట్టించుకోను…అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది ఆ అమ్మాయి. ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news