ఏపీలో రక్తమోడుతున్న రహదారులు..ఆరుగురు మృతి

-

ఏపీలో వరుస రోడ్డు ప్రమాదాలు టెన్షన్ పెడుతున్నాయి. ఈరోజు రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రెండు రోడ్డు ప్రమాదాలలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ముందుగా రావులపాలెం మండలం గోపాలపురం లో రోడ్ ప్రమాదం జరిగింది. బైక్ ను వ్యాన్ ఢీకొట్టిన క్రమంలో బైక్ మీద వెళుతున్న ముగ్గురు మృతి చెందారు. బైకు తుక్కుతుక్కైంది.

మృతులను గోపాలపురానికి చెందిన సతీశ్‌ (21), చంటి(20), కొత్తపేట మండలం కండ్రిగకు చెందిన సురేంద్రగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో పక్క విజయనగరం జిల్లా సీతానగరం మండలం అచ్చయ్యపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ డీ కొన్న ఘటనలో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news