విజయనగరం పర్యటనకు బాబు.. సర్వత్రా టెన్షన్ టెన్షన్ !

-

ఈరోజు చంద్రబాబు విజయనగరం పర్యటనకు వెళ్తున్నారు. రామతీర్ధం వద్ద విగ్రహం ధ్వంసం అయిన ఆలయాన్ని ఆయన పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన విశాఖ చేరుకుని, అనంతరం రోడ్డు మార్గం ద్వారా విజయనగరం పట్టణం మీదుగా 11.30గంటలకు రామతీర్థం చేరుకుంటారు. మెట్లమార్గం ద్వారా రామతీర్థం కొండపైకి చేరుకుని, సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తారు.

అనంతరం రామతీర్థం నుండి విజయనగరం అశోక్‌ బంగ్లా చేరుకొని మాజీ కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజుతో కలిసి ప్రెస్‌ మీట్‌లో పాల్గంటారు. ఇక  పలువురు టిడిపి నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసుల అదుపులో రామతీర్ధంకి చెందిన వార్డు మెంబర్లు సూరిబాబు, రాంబాబు. అర్ధ రాత్రి మరో నలుగురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నేరం అంగీకరించమని తమ వారిని హింశిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news