తెలంగాణాలో కరోనాతో ఆరుగురు మృతి…?

-

తెలంగాణాలో కరోనా సోకి నిజంగా ఆరుగురు మరణించారా…? తెలంగాణా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ట్వీట్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. “మార్చ్ 13-15 మధ్య ఢిల్లీ నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి #Coronavirus సోకింది. వారిలో తెలంగాణకు చెందిన ఆరుగురు మరణించారు. గాంధి ఆసుపత్రిలో ఇద్దరు, అపోలో ఆసుపత్రి, గ్లోబల్ ఆసుపత్రి, నిజామాబాద్, గద్వాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.”

వీరి ద్వారా #Coronavirus సోకే అవకాశం ఉందని అనుమానిస్తున్న వారందరిని ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు తమంతట తాముగా, విధిగా సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ కోరుతున్నది” అని రెండు ట్వీట్స్ చేసింది తెలంగాణా ముఖ్యమంత్రి కార్యాలయం.

ఇప్పుడు వారు అందరిని వెతికే పనిలో పడింది తెలంగాణా ప్రభుత్వం. వారి కోసం ఇప్పుడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వారి సమాచారం ఎక్కడ దొరుకుతుందా అని తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని వెతుకుతుంది ఇప్పుడు. ఢిల్లీలోని మర్కజ్‌లో మార్చి 13 నుంచి 15 వరకు మతపరమైన ప్రార్థనలు జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రార్థనల్లో వేలాది మంది పాల్గొన్నట్లు సమాచారం.

ఒక్క ఇండోనేసియా నుంచే 1800 మంది పాల్గొన్నట్లు కేంద్రహోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇక్కడికి పలు ప్రాంతాల నుంచి వెళ్ళారని అధికారులు గుర్తించారు. వారి సమాచారం సేకరించే పనిలో పడ్డారు. ఇప్పుడు వాళ్ళు అందరూ ఎక్కడ తిరుగుతున్నారు…? వాళ్ళు అసలు ఎక్కడ ఉన్నారు…? ఈ ప్రశ్నలు రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా వేధిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news