ప్రపంచంలో కోవిడ్ విలయతాండవం చేస్తుంది. దక్షిణాఫ్రికాలో మొదలైన కొత్త వేరియంట్ ఓమిక్రాన్ తక్కువ కాలంలోనే ప్రపంచంలోని వంద దేశాలకు పాకింది. ముఖ్యంగా యూరోపియన్ దేశాలతో పాటు యూఎస్ఏలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. అక్కక రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా యూకే ఓమిక్రాన్ ధాటికి అల్లాడిపోతోంది. యూకేలో కేసుల సంఖ్య లక్ష దాటింది. యూకేలో ఇప్పటి వరకు 1,14,625 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా కేసులు సంఖ్య రెండు లక్షలకు చేరువలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కేసులు 1,83,204 లకు చేరాయి. డెన్మార్క్ లో 32877, కెనడాలో 7500, యూఎస్ 6331 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
ఇదిలా ఉంటే ఓమిక్రాన్ తో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 31 మంది మరణించారు. ఇందులో ఎక్కువగా 29 మంది ఒక్క యూకేలోనే మరణించారు. మొదట్లో ఓమిక్రాన్ వల్ల స్వల్ప లక్షణాలే ఉంటున్నాయి… మరణాలు లేవనుకుంటున్న తరుణంలో మరణాలు సంభవించడం ప్రజల్లో ఆందోళనలు పెరిగేలా చేస్తోంది. మరో వైపు ఇండియాలో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే దేశంలో 400కు పైగా కేసులు నమోదయ్యాయి.