గత ఏడాదికి సంబంధించి ఆయా పార్టీలకు అందిన విరాళాల విషయంలో బీజేపీ మరో రికార్డు నెలకొల్పింది. దేశవ్యాప్తంగా ప్రధానమైన 12 పార్టీలకు రూ.258 కోట్ల వరకు విరాళాలు అందగా.. అందులో ఒక్క బీజేపీకే రూ. 212 కోట్ల డొనేషన్లు అందాయి. మొత్తం విరాళాలలో ఇది 82 శాతం కావడం విశేషం. ఇక రెండో స్థానంలో బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ నిలిచింది. ఆ పార్టీకి రూ.27 కోట్లు అందగా మొత్తం విరాళాలలో ఙది ఇది 10.45 శాతానికి సమానం.
ఇక కాంగ్రెస్, ఎన్పీపీ, ఏఐఏడీఎంకే, డీఎంకే, ఆర్జేడీ, ఆప్, ఎల్పేజీ, సీపీఎం, సీపీఐ, ఎల్జేపీలకు మొత్తం కలిపి రూ.19 కోట్లే విరాళంగా అందాయి. ఈ మేరకు ఎలక్టోరల్ ట్రస్టులు ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించాయని ‘ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రీఫార్మ్ (ఏడీఆర్) వెల్లడించింది. మొత్తం 23 ఎలక్టోరల్ ట్రస్టులు ఉండగా.. వాటిలో 16 ట్రస్టులు ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించాయి.