మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా స్విట్జర్లాండ్‌లోని దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కోసం సుమారు 70 మందిని షిండే తీసుకెళ్తున్నారని ఆయన విమర్శించారు. ఈ విషయం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తెలుసా? అని,జాతీయ ప్రతినిధి బృందం ఇంత పెద్దగా ఎప్పుడూ లేదని ఆదిత్య ఠాక్రే ఆరోపించారు . ఈ భారీ బృందంలో కొందరు వారి ఖర్చుల కోసం ప్రజలు పన్నుగా చెల్లించిన డబ్బును ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
కాగా, జనవరి 15 నుంచి 19 వరకు దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ జరుగనున్నది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, పారిశ్రామిక మంత్రి ఉదయ్ సామంత్‌తో కూడిన 10 మంది సభ్యులతో కూడిన బృందానికి విదేశాంగ శాఖ నుంచి క్లియరెన్స్ ఉందా అని ఆదిత్య ఠాక్రే ట్విట్టర్(ఎక్స్) లో పోస్ట్ చేశారు.