70శాతం ఉద్యోగాలు స్థానికులకే కావాలన్న కేటీఆర్.. నిరుద్యోగుల సమస్యలు తీరినట్టేనా?

-

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్ళు, నిధులు, నియామకాలు అన్న అంశం మీద. వీటిల్లో నియామకాల విషయంలో నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారన్న విషయం ఎప్పటికప్పుడు తేటతెల్లం అవుతూనే ఉంది. ఐతే తాజాగా పారిశ్రామిక సంస్థలతో సమావేశం అయిన మంత్రి కేటీఆర్, కొన్ని ప్రతిపాదనలు వారి ముందు ఉంచినట్లు తెలుస్తుంది. పరిశ్రమల్లో 70శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న ప్రతిపాదనను తీసుకువచ్చారు. ఈ విధానాన్ని అమలు చేసే పరిశ్రమలకు నూతన పారిశ్రామిక విధానం కింద ప్రోత్సహకాలు, పన్ను మినహాయింపులు ఇస్తామని తెలిపారు.

అలాగే స్థానికులు సాంకేతిక రంగంలో రాణించడానికి నైపుణ్య శిక్షణా సంస్థలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ అన్నారు. దీంతో తెలంగాణలో నిరుద్యోగుల సమస్య తీరుతుందా అన్న అంశం మీద చర్చలు జరుగుతున్నాయి. మరో పక్క 70శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనుకోవడం మంచి పరిణామమే అంటున్నారు. ఇదిలా ఉంటే, నూతన పారిశ్రామిక సంస్థల్లో కాలుష్య నియంత్రణకు అవసరమయ్యే చర్యలను ఇప్పటి నుండే చేపట్టాలని అధికారులను సూచించారు. ఈ విషయంలో కాలుష్య నియంత్రణ బోర్డుతో కలిసి పనిచేయాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news