ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు రసవతారంగా మారాయి. ఒక పార్టీ నుండి నేతలు మరొక పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి క్యూ కడుతుండగా, మరోవైపు బిజెపి పార్టీకి చెందిన కొందరు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ తో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్లు కోమటి రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ నేత ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్‌లోకి తీసుకోవడం పెద్ద విషయం కాదన్నారు. 60 మంది ఎమ్మెల్యేలను టచ్‌లోకి తీసుకోవడం పెద్ద విషయం కాదని అన్నారు. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ ప్రభుత్వం నాయకులను కొనుగోలు చేస్తోందని తెలిపారు. మల్కాజ్‌గిరిలో ప్రధాని మోడీ రోడ్డు షో తర్వాత బీజేపీకి మద్దతు పెరిగిందని ఈటెల రాజేందర్ అన్నారు. అన్ని రంగాలు, వర్గాల ప్రజలు మోడీ మరో సారి ప్రధాని కావాలనుకుంటున్నారని తెలిపారు.