తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఇవాళ ఉదయం రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం కోసం 8 గంటల సమయం పడుతుంది.
నిన్న శ్రీవారిని 63,023 మంది దర్శించుకున్నారు. 19,091 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి హుండీ ఆదాయం రూ. 3.15 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక అటు అయ్యప్ప భక్తులకు శుభవార్త…శబరిమలకు మరో 22 ప్రత్యేక రైళ్లు వెళ్లనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే భక్తుల కోసం డిసెంబర్, జనవరిలో 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.