తెలంగాణలో నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు కలకలం రేపాయి. శనివారం రాష్ట్రంలో ఎనిమిది చోట్ల ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వరంగల్, చర్ల, కొత్తగూడెం, భద్రాచలంతో పాటు ఇతర ప్రాంతాల్లో అధికారులు ముమ్మరంగా సోదాలు చేశారు. మావోయిస్టులకు అధునాతన ఆయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాల సరఫరా లక్షంగా అధికారులు రైడ్స్ చేశారు. ఈ తనిఖీల్లో ఎన్ఐఏ అధికారులు పెద్ద ఎత్తున డ్రోన్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ క్రమంలో పలువురిపై కేసులు నమోదు చేశారు.అలాగే ఈ దాడులకు సంబంధించి.. 12 మందిపై నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నవారిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్వయంతో లోని తెలంగాణలో ఎనిమిది చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విరుచుకుపడుతోంది. భారీ ఎత్తున సోదాలను ప్రారంభించింది. ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేసి యువతను ఉగ్రవాద కార్యకలాపాల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారనే అనుమానంతో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో అనేక చోట్ల ఉగ్రవాదంతో సంబంధం ఉన్న 100 మందిని ఇప్పటి వరకు అరెస్టు చేశారు.