టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడంపై స్పందించారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా కక్ష సాధించడం కోసమే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు. విపక్షాల గొంతు నొక్కడమే వైసీపీ లక్ష్యమని.. ఏపీలో జరుగుతున్న అరాచక పాలనను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి జగన్ తీరు ఇలానే వుందని దుయ్యబట్టారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బెజవాడ ప్రయాణం వాయిదా పడింది. పవన్ శంషాబాద్ నుంచి రావాల్సిన విమానం టేకాఫ్ కు నిరాకరించడంతో వాయిదా పడింది. దీంతో గన్నవరం విమానాశ్రయం దగ్గర నుంచి నాదెండ్ల మనోహర్ వెనుతిరిగి వెళ్లిపోయారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ.. పవన్ కల్యాణ్ సంఘీభావం తెలపడానికి హైదరాబాద్ నుండి బయలుదేరితే ఆయన ప్రయాణించే ప్రత్యేక విమానాన్ని టేక్ ఆఫ్ అవ్వకుండా ఎయిర్ పోర్ట్ సిబ్బంది నిలిపివేశారని పేర్కొన్నారు.