దేశవ్యాప్తంగా ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో టీచింగ్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఉమ్మడి నియామక ప్రాథమిక
పరీక్షా ప్రకటనను ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ విడుదల చేసింది.
పోస్టులు: టీజీటీ, పీజీటీ, పీఆర్‌టీ
ఖాళీలు: 8000 (సుమారుగా)
అర్హతలు: సంలబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీతోపాటు బీఈడీ/ రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత. సీటెట్/ ఆయా రాష్ట్రాల టెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
వయస్సు: 40 ఏండ్లు మించరాదు. ఐదేళ్ల టీచింగ్ అనుభవం ఉన్నవారికి గరిష్ఠ వయఃపరిమితి 57 ఏళ్లు.
స్క్రీనింగ్ పరీక్షతేదీ: నవంబరు 21, 22.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్.
దరఖాస్తు: ఆన్‌లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.500
చివరితేదీ: అక్టోబర్ 20
నోట్: ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు సంబంధిత పాఠశాలలు విడుదల చేసే ప్రకటనను అనుసరించి మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా పాఠశాలలు తదుపరి నియామక ప్రక్రియ (ఇంటర్వ్యూ, బోధనా నైపుణ్యాల మదింపు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ) ద్వారా ఖాళీలను భర్తీ చేస్తాయి. సాధారణంగా నవంబరు – మార్చి మధ్యలో ప్రకటనలు విడుదలయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ : http://aps-csb.in/