అమ్మో : తెలంగాణాలో 8 వేల మిస్సింగ్ కేసులు !

-

రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మిస్సింగ్ కేసుల పై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మిస్సింగ్ కేసుల పై హైకోర్టు సీరియస్ అయింది. మిస్సింగ్ కేసులు నమోదవుతున్నా పోలీసుల ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది.రోజురోజుకు మిస్సింగ్ కేసులు పెరుగుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పిటీషనర్ పేర్కొన్నారు. 2014 నుండి 2019 వరకు ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం 8 వేల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని, 2019 నుండి 2020 నవంబర్ వరకు ఈ కేసులు రెట్టింపు అయ్యాయని కూడా పేర్కొన్నారు.

అది కూడా ఎస్సి, ఎస్టీ, బీసీ కమ్యూనిటీ వారే అధికంగా మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నాయని పేర్కొన్నారు ఈ పిటిషన్ పై కౌంటర్ ధాఖలు చేసిన ప్రభుత్వం మిస్సింగ్ కేసుల పై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. షీటీమ్ ,దర్పన్ యాప్, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ , ఆపరేషన్ ముస్కాన్ లాంటి ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. అలానే కోర్టు అడిగిన అన్ని ప్రశ్నలకి డిసెంబర్ 3వ తేదిన నివేదిక అందిస్తామని ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 10కి వాయిదా వేసింది హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news