జేఎన్టీయు అనుబంధ కాలేజీ ప్రిన్సిపాల్ ల తో భేటీ అయిన జేఎన్టీయు రిజిస్ట్రార్… సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వరదల కారణంగా ఆన్ లైన్ క్లాసులు మిస్ అయిన వారికి మళ్లీ క్లాసులు నిర్వహిస్తున్నామని చెప్పారు. గ్రామాలలో వివిధ కారణాలతో ఆన్లైన్ క్లాస్ లు వినలేక పోయిన వారికి స్పెషల్ క్లాసులు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 12 నుంచి జరగబోయే ఇంజినీరింగ్ పరీక్ష లను విద్యార్థి ఏ జేఎన్టీయు అనుబంధ కాలేజీలో అయినా రాసుకునే వెసులుబాటు కల్పించారు.
ఈ నెల 17న ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులు సీటు పొందిన కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు. డిసెంబర్ ఒకటి నుంచి ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు క్లాస్ లు నిర్వహిస్తాం అన్నారు. క్లాస్ లు ఆన్లైనా ఫిజికలా అనేది ప్రభుత్వ నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది అన్నారు.