ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 12 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ జీప్ వయనాడ్ సమీపంలోని మనంతవాడిలోని తవిన్‌హాల్ గ్రామ పంచాయతీలో లోయలో పడింది. ఈ ఘటనలో జీప్‌లో ఉన్న తొమ్మిది మంది కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జీప్ డ్రైవర్‌తో సహా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించాయి. మృతుల సంఖ్యను జిల్లా కలెక్టర్ ధృవీకరించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
వివరాల్లోకి వేళ్తే.. తేయాకు తోటల్లో కూలీలుగా పనిచేసే 11 మంది మహిళలు శుక్రవారం పని ముగించుకుని దీపు టీ ట్రేడింగ్ కంపెనీకి చెందిన జీపులో ఇళ్లకు బయలు దేరారు. మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో మనంతవాడి సమీపంలో జీపు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మనంతవాడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. కాగా, ఘటనపై కేరళ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సీఎం ఆదేశాల మేరకు అటవీశాఖ మంత్రి ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు సీఎం సానుభూతి తెలియజేశారు.