సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ని భారత చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తాజాగా విడుదల చేశారు. లోక్ సభ తో పాటు 4 రాష్ట్రాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ని ప్రకటించింది సీఈసీ. భారత చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ని తాజాగా ప్రకటించారు.
ప్రస్తుత 17వ లోక్ సభ గడువు జూన్ 16న లోక్ సభ ఎన్నికల గడువు ముగియనుంది. దేశంలో 96.88 కోట్ల ఓటర్లు కలరు. అంటే సుమారు 97 కోట్ల ఓటర్లున్నారు. వీరిలో కోటి 82 లక్షల మంది కొత్త ఓటర్లున్నారు. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలున్నాయి. దేశవ్యాప్తంగా 49.7 మంది పురుష ఓటర్లు, 47.1 కోట్ల మంది మహిళా ఓటర్లున్నారు.ఇది అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని జనాభాను కలిపినా ఎక్కువ అన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్. 1.50 కోట్ల మంది పోలింగ్ సిబ్బంది, సెక్యూరిటీ ఆఫీసర్లు విధుల్లో పాల్గొంటారని తెలిపారు. ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంలు సిద్ధం చేసినట్టు తెలిపారు.