ముగ్గురు గిరిజన ఎమ్మెల్యేలకు చంద్రబాబు వెన్నుపోటు.. చంద్రబాబును నమ్మితే అంతేనా..??

-

వెన్నుపోటుకు చంద్రబాబునాయుడు బ్రాండ్ అంబాసిడర్ అని మరోసారి రుజువైంది.. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి.. తెలుగుదేశం పార్టీలోకి జంప్ పైన ముగ్గురు గిరిజన ఎమ్మెల్యేలకు చంద్రబాబు మొండి చేయి చూపారు.. దీంతో వారి రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడిపోయిందని టిడిపి నేతలు చెబుతున్నారు.. విజ్ఞత కలిగిన వైసీపీ నుంచి టిడిపిలోకి జంప్ పై రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నారని పలువురు రాజకీయ పండితులు విమర్శిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైనింగ్ లైసెన్స్ ఆశ చూపి గిరిజన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుని పార్టీలో చేర్చుకున్నారు చంద్రబాబు. 2014లో వైఎస్ జగన్ అరకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిచిన సర్వేశ్వరరావు టిడిపిలో చేరారు. కొన్ని రోజుల తర్వాత మావోయిస్టుల చేతిలో మృత్యువాత పడ్డారు. అనంతరం ఆయన కుమారుడు శ్రావణ్ ను చంద్రబాబు క్యాబినెట్లోకి తీసుకొని ఏడాది తర్వాత పక్కన పెట్టేశారు. 2019లో టిడిపి తరఫున పోటీ చేసి ఆయన పరాజయం ఫాలవ్వడంతో.. పూర్తిగా పక్కన పెట్టేసారని ఈసారి ఎన్నికల్లో అతనికి టిక్కెట్ ఇవ్వలేదంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి..

రంపచోడవరం, పాడేరు మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అలాగే తయారైంది.. చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడ్డ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు అప్పట్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటినుంచి వారికి పార్టీలో ప్రాధాన్యత దక్కలేదంటూ వారి అనుచరులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గిడ్డి ఈశ్వరికి టికెట్ ఇవ్వకుండా.. పొత్తుల్లో భాగంగా బిజెపికి చంద్రబాబు టికెట్ కట్టపెట్టేశారు.

దీంతో ఆమె అనుచరులు మండిపడుతున్నారు. రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆమెకి టిక్కెట్ ఇవ్వకుండా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఐదేళ్లపాటు పార్టీ బలోపేతం కోసం పనిచేసిన రాజేశ్వరిని చంద్రబాబు గుర్తించకుండా.. మిరియాల శిరీష కు టికెట్ కేటాయించడంపై రాజేశ్వరి సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఈ ముగ్గురు గిరిజన ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news